Mahaa Daily Exclusive

  కేంద్ర పధకం పోడు రైతులకు వర్తింపచేయాలి ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్..!

Share

మహా భద్రాచలం

ప్రధానమంత్రి జన జాతీయ గౌరవ ఉద్ధరణ అభియాన్ పథకం కింద 90 శాతం సబ్సిడీతో గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం వంటి సబ్సిడీ పథకాలు ఆదివాసి మారుమూల గిరిజన ప్రాంతాలలో ఉన్న పోడు పట్టా కలిగిన గిరిజన రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు.
మంగళవారం భద్రాచలం డివిజన్ పరిధిలోని పశుసంవర్ధక శాఖ అధికారులతో గిరిజన గ్రామాలలో చేపట్టవలసిన కార్యాచరణపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
ప్రధానమంత్రి జనజాతి గౌరవ ఉద్ధరణ అభియాన్ పథకం గురించి గిరిజన గ్రామాలలో ముమ్మరంగా ప్రచారం చేసి ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదించే విధంగా సంబంధిత పశుసంవర్ధకశాఖ అధికారులు కృషి చేయాలని అన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ మార్గదర్శకాల ప్రకారము పోడుపట్టాకలిగిన గిరిజన రైతులను మరియు గిరిజన కుటుంబాలలో లబ్ధిదారులను ఎంపిక చేసి వారు ఎంచుకున్న పథకాలను అందజేసి వారి జీవనోపాధికి, ఆదాయ అభివృద్ధికి మరియు ఆదివాసి రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచి స్వయం ఉపాధి పథకాలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఏడి రవీంద్రనాథ్ ఠాగూర్, దుమ్ముగూడెం, చర్ల, అశ్వాపురం, బూర్గంపాడు మండలాలకు చెందిన పశువైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest