Mahaa Daily Exclusive

  టీయూడబ్ల్యూజే ఐజేయు మహాసభను జయప్రదం చేయండి…!

Share

కొణిజర్ల,మహా.

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని స్థానిక శాస్త్ర నగర్ లోని స్వామి అయ్యప్ప స్వామి దేవాలయ సమీపంలోని శబరి గార్డెన్ లో ఈ నెల 24న జరగనున్న టీయూడబ్ల్యూజే ఐజేయు ఖమ్మం జిల్లా నాలుగో మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం సీనియర్ జర్నలిస్ట్ పగడాల మధు,జిల్లా కౌన్సిల్ సభ్యులు మోటపోతుల బాబురావు సమక్షంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో వారు మంగళవారం మాట్లాడి పిలుపునిచ్చారు.ఈ మహాసభలకు పెద్ద ఎత్తున రాష్ట్ర మంత్రులు ఉన్నత అధికారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు యూనియన్ రాష్ట్ర జిల్లా నేతలు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు వారు తెలియజేశారు.ఇందుకుగాను మండల కేంద్రమైన కొణిజర్ల లో పెద్ద ఎత్తున ఖమ్మం సరిహద్దు గ్రామమైన తనికెళ్ల, కొణిజర్ల,పల్లిపాడు ప్రధాన కేంద్రాల్లో జాతీయ రహదారిపై మహాసభ జయప్రదం,స్వాగత బ్యానర్లను సంఘం యూనియన్ బాధితులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం జరిగిందని వారు తెలియజేశారు.ఈ మహాసభలకు ప్రతి జర్నలిస్టు ప్రతి యూనియన్ నాయకుడు బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క జర్నలిస్టును ఈ సభకు తరలించే విధంగా కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో పెద్దలు తాతా సుధాకర్ జర్నలిస్టులు ముత్తనబోయిన శ్రీనివాసరావు,తుమ్మలపల్లి మంగపతి రావు,పాపగంటి నాగేశ్వరరావుకే రవికుమార్,రాము,షరీఫ్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Latest