Mahaa Daily Exclusive

  కారేపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు పట్టాల పంపిణి నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం..!

Share

కారేపల్లి, మహా ; కారేపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణి చేశారు. ఇండ్ల పట్టాలను ఇంచార్జీ ఎంపీడీవో మల్లెల రవీంద్రప్రసాద్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. పంచాయతీలో 73 మంది పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణి చేయడం జరిగింది. ఈసందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ
కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల గురించి ఆలోచించి ఇందిరమ్మ ఇండ్ల పధకాన్ని తీసుకవచ్చిందన్నారు. మాటకు కట్టుబడి విడుతల వారిగా పేదలకు ఇండ్ల మంజూరు చేస్తూ ప్రభుత్వం ముందడుకు వేస్తుందన్నారు. పదేండ్లు ఏండ్లుగా ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇండ్లు ఇచ్చి వారి కలలు సాకారం చేసిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తలారి చంద్ర ప్రకాష్ , పగడాల మంజుల, ఇమ్మడి తిరుపతిరావు, మేదరి వీర ప్రతాప్, వాణిజ్య విభాగ జిల్లా ఉపాధ్యక్షులు. ప్రముఖ వ్యాపారవేత్త సురేందర్ మనియా, అడ్డగోడ ఐలయ్య, పోల గాని శ్రీను, తాత వెంకటేశ్వర్లు, తొగర శ్రీను, అనీఫ్ , ఆదేర్ల రాములు,మేదరి రాజా,తదితరులు పాల్గొన్నారు.

Latest