AP: చేనేత సహకార సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. మంగళగిరిలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చేనేత వస్త్రాలపై జిఎస్‌టి మినహాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. నూతన సహకార సంఘాలను ఏర్పాటుతో పాటు, నిద్రాణస్థితిలో ఉన్న సంఘాలను బలోపేతం చేస్తామన్నారు.
Post Views: 109







