ఢిల్లీ, మహా
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఉల్లాసంగా మాట్లాడారు. తెలంగాణ నేతలతో సరదాగా జోక్స్ వేసి ఖర్గే నవ్వులు పూయించారు. గౌడ్ జి ఆప్ బీసీ ..యా ఓసి.. అని ఖర్గే చమత్కరించారు. మహేష్ భాయ్ బై బర్త్ బీసీ బట్ పొలిటికల్లి ఓసి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సరదాగా అన్నారు. దీంతో అందరూ నవ్వారు.
ఖర్గే నివాసంలో 2 గంటలపాటు బీసీ కులగణన, 42 శాతం రిజర్వేషన్లు అంశంపై చర్చ జరిగింది. ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభ ప్రధాన పక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్.కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ తదితరులు హాజరయ్యారు. గత కొంతకాలంగా హైకమాండ్ కు నేతలకు మధ్య ఏదో ఉందన్న ప్రచారాలన్నీ ఈ మీటింగ్ లతో తుడిచిపెట్టుకుపోయాయి. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ గత ఏడాదిన్నరలో ఎంతో సాధించాయని నేతలు ప్రశంసించారు.








