Mahaa Daily Exclusive

  రైతులకు అందవలసిన పరిహారం వక్స్ బోర్డు ఖాతాలో జామచేస్తున్న వైనం కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి..!

Share

మధిర,జూలై23(మహా

మధిర మండల పరిధిలో
నాగపూర్ అమరావతి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వము ఉదారంగా వ్యవహరించి న్యాయమైన పరిహారం ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం అలసత్వం కారణంగా పరిహారం వాస్తవ రైతులకు కాకుండా వక్ఫ్ బోర్డు కు జమ చేసిన తీరుకు బిజెపి రాష్ట్ర మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. . మాటూరు రెవెన్యూ పరిధిలోని సుమారు 200 ఎకరాల భూములు దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటూ పట్టాదారు పాస్ పుస్తకాలు సైతం కలిగి ఉన్నారని కెసిఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ తప్పుల కారణంగా ఆ భూములు వక్ఫ్ బోర్డుగా నమోదు కావడంతో రైతులు కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్నారని ధరణి పోర్టల్ రైతులకు ఇబ్బందిగా మారిందని దాన్ని ప్రక్షాళన చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ నాయకులు రెవెన్యూ రికార్డులను సరిచేయాలని న్యాయపోరాటం చేస్తున్న రైతులకు అండగా నిలవాల్సింది పోయి సదరు భూమి నుండి ప్రాజెక్టు విస్తరణలో పోతున్న 10 ఎకరాల భూమికి కేంద్రం ఇచ్చిన పరిహారాన్ని వక్ఫ్ బోర్డు కు జమ చేయడం చూస్తుంటే ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుందన్నారు. పరిహారం అందించే విషయంలో టైటిల్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో రెవెన్యూ తప్పిదాలను సరిదిద్దుకొని వాస్తవ సాగుదారులకు పరిహారం ఇవ్వకుండా ఏకపక్షంగా అనాలోచితంగా వక్ఫ్ బోర్డు కు ఎలా సుమారు రెండు కోట్ల రూపాయలు ఎలా జమ చేశారో చెప్పాలన్నారు . ఖమ్మం జిల్లా నుంచి నేతృత్వం వహిస్తున్న రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, మధిర శాసనసభ నుంచి నేతృత్వం వహిస్తున్నటువంటి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి భూములు కోల్పోతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వము ఇచ్చే పరిహారాన్ని అందించే విధంగా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భూ బాధితులతో కలిసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు,పట్టణ అధ్యక్షులు శివరాజ్ సుమంత్, జిల్లా నాయకులు రామిశెట్టి నాగేశ్వరావు,మర్శకట్ల స్వర్ణకార్, కుంచం కృష్ణారావు, పాపట్ల రమేష్ , పట్టణ ప్రధాన కార్యదర్శి, బియ్యవరపు రామకృష్ణ,మాదిరాజ్ సాయిరాం, ఎండి గౌసు శంకర్, బాధిత రైతులు పాల్గొన్నారు.