Mahaa Daily Exclusive

  కొత్తగూడెంలోని భవిత కేంద్రాన్ని సందర్శించిన విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా..!

Share

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 23 (మహా):
కొత్తగూడెంలోని భవిత కేంద్రాన్ని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా సందర్శించి, దివ్యాంగ పిల్లలతో వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు . ఈ సందర్భంగా దివ్యాంగ పిల్లలకు అందవలసిన సదుపాయాలన్నీ పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు.
ముఖ్యంగా భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల యొక్క కౌశలాలను అభివృద్ధి పరచుకొని, సాధారణ విద్యార్థులతో సమానంగా విద్యను అభ్యసించే విధంగా ఈ భవిత కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు.
దివ్యాంగ పిల్లలందరికీ బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమం లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలాస్ , ఉన్నత విద్యాశాఖ కమీషనర్ దేవసేన, కలెక్టర్ జితేష్ వి పాటిల్, అసిస్టెంట్ కలెక్టర్ (అండర్ ట్రైనీ) సౌరబ్ శర్మ, రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్స్ రాజీవ్ , మదన్ మోహన్ , ఆర్ జే డి సత్యనారాయణ రెడ్డి , జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వర చారి , జిల్లా కోఆర్డినేటర్ లు నాగరాజ శేఖర్, సైదులు, సతీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.