Mahaa Daily Exclusive

  విద్యారంగా సమస్య లు పరిస్కారం చేయండి పి, డి, ఎస్, యు. ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా విద్యార్థుల తరగతుల బహిష్కరణ*..!

Share

తల్లాడ, జులై, 23 (మహా ):-

విద్యారంగా సమస్యలు పరిష్కారం చేయాలనీ కోరుతు
తల్లాడ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులని బహిష్కరణ చేసి నిరసన తెలియచేసారు.
ఈ సందర్బంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( , పి డి ఎస్ యు )ఖమ్మం జిల్లా కోశాధికారి గాజుల శశి కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రo లో విద్యారంగా సమస్యలు పరిష్కారం చేయడం లో ప్రభుత్వం విఫలం అయింది అని, నేటికీ విద్యారంగానికి విద్యాశాఖ మంత్రి లేడని, జిల్లా లో రెగ్యులర్ పూర్తి స్థాయి లో ఉపాధ్యాయులు లేక విద్యారంగం కుంటూ పడిందని, విద్యా నాణ్యత పడిపోయిందని, దేశంలో తెలంగాణ విద్యా శాతం అట్టడుగునా ఉన్నదని, నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యా కాషాయికరణ చేస్తున్నారని, శాస్రియ విద్యా విధానం అమలు చేయడం లేదని పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే,విడుదల చేయాలని గురుకులాలకు సొంత భవనాల నిర్మించాలని మెస్ కాస్మోటిక్ చార్జీలను పెంచాలని. ఉచిత బస్సు పాసుల సౌకర్యం కల్పించాలని ఖాళీగా ఉన్న ఎం,ఈ,ఓ. పోస్టులను,భర్తీ చేయాలని గురుకులాల్లో అశాస్త్రీయంగా వచ్చిన సమయపాలన మార్చాలని ప్రైవేట్, కార్పొరేట్, విద్యాసంస్థల్లో,ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. వేoటనే విద్యారంగా సమస్యలు పరిష్కారం చేయాలనీ, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలిపారు.
ఈ విద్యాసంస్థల బంద్ కార్యక్రమంలో తల్లాడ మండల నాయకులు నగేష్ అభిలాష్. అనిల్ రియాజ్ కిషోర్. తదితరులు పాల్గొన్నారు.