Mahaa Daily Exclusive

  మహిళల చిరునవ్వులతో, ప్రభుత్వం మనుగడ – మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు స్వేచ్ఛ మరియు భరోసా -మంత్రి తుమ్మల

Share

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 23 (మహా):
మహిళల చిరునవ్వుతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం కొత్తగూడెం ఆర్టిసి బస్టాండ్ నందు 200 కోట్ల ఉచిత ప్రయాణాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఎస్పీ రోహిత్ రాజు మరియు స్థానిక సంస్థల అదనపు విద్యాచందన మరియు కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన రెండవ రోజే సోనియాగాంధీ జన్మదిన సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 200 కోట్లు మంది ఇప్పటివరకు ప్రయాణాలు సాగించారన్నారు. దీని ద్వారా మహిళలకు ప్రయాణ చార్జీ రూపంలో 6680 కోట్లు ఆదా అయ్యాయి అని అన్నారు. ఈ మొత్తాన్ని ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు స్వేచ్ఛ మరియు భరోసా ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కట్టుబడి అన్ని సంక్షేమ పథకాలను మహిళలకే రూపొందించింది అన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 9 బస్సులు నడుపుతున్నారు అని తెలిపారు. మహిళలను అభివృద్ధి పరచడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలతో ఏ సంక్షేమ పథకమైన ఇందిరమ్మ ఇల్లు, 500 గ్యాస్ సిలిండర్ తదితర పథకాలు అన్ని మహిళలకే రూపొందించడం జరిగిందన్నారు. మహిళలకు ఇవ్వడం ద్వారా తమ కుటుంబాల అభివృద్ధితోపాటు దేశ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం పరుచుకొని మహిళలను అభివృద్ధి చెందాలన్నారు. దేశంలోనే ప్రభుత్వం చేపడుతున్న పథకాలు తెలంగాణ మోడల్ గా ఉన్నాయన్నారు. కొత్తగూడెం జిల్లా అభివృద్ధిలో భాగంగా కొత్తగూడెం నుండి హైదరాబాద్, నాగపూర్ మరియు రాజమహేంద్రవరం వరకు జాతీయ రహదారులు మంజూరు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కొత్తగూడెం ప్రధాన నగరంగా రూపాంతరం చెందుతుందన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి రహదారులతో పాటు విద్య, వైద్య రంగాలలో అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. మణుగూరు నుండి కిరండోల్ రైల్వే లైన్ నిర్మాణానికి మంజూరు కాగా పాండురంగాపురం నుండి భద్రాచలం వరకు 16 కిలోమీటర్ల రైల్వే లైన్ ను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అదేవిధంగా కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ద్వారా పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.

:- కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ..

ఒకప్పుడు నష్టాలలో ఉన్న ఆర్టీసీ సంస్థ ప్రభుత్వం ఏర్పడిన 18 నెల కాలంలో 200 కోట్ల ఉచిత ప్రయాణాలతో 6680 కోట్ల రూపాయలు ఆదాయాన్ని గడించటం చాలా గొప్ప విషయం అన్నారు. ప్రభుత్వం దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కొత్తగూడెం మరియు పాల్వంచలో నూతన బస్టాండ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

:- జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ….

ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలు మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడటం తో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి ఉపయోగపడుతున్నాయి అన్నారు . మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకొని మహిళలు ఉద్యోగాలకు, వైద్య అవసరాలకు, చదువుకోవడానికి ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగపడుతుందని దీని ద్వారా ఆత్మస్థైర్యాన్ని ప్రభుత్వం నింపిందన్నారు.

అనంతరం జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసిన మహిలా విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగులకు మరియు లబ్ధి చేకూరిన మహిళల కు మంత్రి బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.