ఖమ్మం,మహా.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నేత, మాజీ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని (జూలై 24) పురస్కరించుకొని, బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రాష్ట్ర ప్రజల కోసం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన కొరకు, పరిశ్రమలు, ఐటీ రంగం, మున్సిపాలిటీ అభివృద్ధిలో కేటీఆర్ విశేష కృషి చేశారని కొనియాడారు. ప్రత్యేకంగా ఐటీ రంగంలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపిన నాయకుడిగా ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలతో మమేకమై, రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తిగా గుర్తుచేశారు. ఆయన అంకితభావం, కార్యదీక్ష, ప్రజల పట్ల నిబద్ధత ఓ అసాధారణ నాయకుడిని తీర్చిదిద్దిందన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ కిట్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు, మొక్కల నాట్లు, హరితహారం, అన్నదాన కార్యక్రమాలు జరగడాన్ని అభినందించారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మరింత బలపడుతుందని ఆశించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యలపై గళమెత్తే ధైర్యమైన నాయకుడిగా ఆయన కనిపిస్తారని పేర్కొన్నారు. సమస్యలపై పరిష్కార దిశగా ఆలోచించగల నైపుణ్యం ఆయనకు ప్రత్యేకత అన్నారు. భవిష్యత్తులో మరిన్ని బాధ్యతలు చేపట్టి, దేశవ్యాప్తంగా తెలంగాణ ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. యువతకు మార్గదర్శిగా, మార్గనిర్దేశకుడిగా నిలిచిన నేతగా కేటీఆర్‌ను అభివర్ణించారు. ఆయన చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ఉంటుందని నామ అభిప్రాయపడ్డారు. తండ్రి కేసీఆర్ మార్గంలో తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న నాయకుడిగా కేటీఆర్ అని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఆయనతోనే ఉంటుందని తెల్పుతూ, కేటీఆర్‌కి దీర్ఘాయుష్, మంచి ఆరోగ్యం, విజయవంతమైన రాజకీయ జీవితంతో ముందుకు సాగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని నామ తెలిపారు.








