తలమడుగు మహా:
స్థానిక సంస్థ ఎన్నికల్లో బిజెపి విజయోత్సవ సంబరాలను చూపిస్తామని జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం అన్నారు. తలమడుగు మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఇతర పార్టీల్లో ఉండే నాయకుడిలా కాకుండా ప్రజల్లో ఉంటూ వారికి కావలసిన సేవలందిస్తూ వారి సమస్యలపై బీజేపీ నాయకులు పోరాడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలను సేవా కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలని కార్యకర్తలు నాయకులు అందరూ సమన్వయంతో సమిష్టి కృషి చేయడం వల్ల స్థానిక సంస్థల్లో బిజెపి విజయోత్సవ జెండాను ఎగరేయడం ఖాయమని కార్యకర్తల్లో ఎన్నికల ముందు ఓ కొత్త జోష్ ను నింపారు.నూతనంగా ఎన్నుకోబడ్డ మండల కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షులు శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ధనుంజయ్, నాయకులు జ్యోతి రెడ్డి, చంద్రకాంత్, ప్రభాకర్, స్వామి, కిరణ్, ప్రేమేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, దేవన్న, మహేందర్ యాదవ్,శ్రీనివాస్, రవి బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.








