తలమడుగు మహా:
ఇద్దరు బామ్మర్దులు కలిసి బావను కొట్టి చంపిన ఘటన తలమడుగు మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం తలమడుగు మండలంలోని నడింపల్లి గ్రామానికి చెందిన మృతుడు పగ్గు (50) గత కొంతకాలంగా రుయ్యడి గ్రామంలో నివసిస్తున్నారు. నడింపల్లి గ్రామానికి చెందిన ఆత్రం భీంరావ్, ఆత్రం రాములు గ్రామంలో దేవల్ల పండగ విషయంలో వారి బావ అయినటువంటి నైతం పగ్గు ఇంటికి బుధవారం ఉదయం రావడం జరిగింది. ముగ్గురు కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లి మద్యం సేవించి ఆ తరువాత పగ్గును చందాను అడగడం జరిగింది దీనికి నిరాకరించడంతో అక్కడ మాట మాట పెరిగి వారి బావమరుదులు ఇద్దరు కొట్టుకుంటూ ఇంటి వద్దకు తీసుకువచ్చి మళ్ళీ అక్కడ కొట్టి మెయిన్ రోడ్డు పక్కన ఉన్న సైడ్ కాలువలో పడేసి కొట్టడంతో పగ్గు కి నుదుటిపై గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మరణించినట్లు మృతుడి కూతురు మాడవి భీంభాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఫణిందర్, ఎస్సై రాధిక లు పేర్కొన్నారు.








