Mahaa Daily Exclusive

  ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగస్వాములవ్వాలి..!

Share

ఆదిలాబాద్, మహా

జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని డీఎంహెచ్ఓ డా.నరేందర్ రాథోడ్ అన్నారు. బుధవారం పట్టణంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లాలోని ఎనిమిది ఆర్.బీఎస్.కే బృందాల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమ అమలులో క్రియాశీల పాత్ర పోషించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పాఠశాల సందర్శన సమయంలో పిల్లలకు అందించే పోషకాహారం, పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వాహణ పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. రక్తహీనత నివారణకు ఉపయోగించే మాత్రలను విద్యార్తులతో మింగించాలని సూచించారు. ఈ సమావేశంలో డా. వైసి శ్రీనివాస్, ఆర్.బీఎస్.కే సిబ్బంది పాల్గొన్నారు.