Mahaa Daily Exclusive

  పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి..!

Share

ఆదిలాబాద్, మహా

పెండింగ్ లో ఉన్న మెస్ బకాయిలు, స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నిఖిల్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ. 8300 కోట్ల స్కాలర్షిప్స్, మేస్ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుకొనే పేద,బడుగు బలహీన వర్గాలకు చెందిన డిగ్రీ, పీజీ విద్యార్థులు, స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేకపోవడం నిజంగా బాధాకరమన్నారు. పేరుకేమో ప్రభుత్వ కళాశాల కానీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ బకాయిలు రాక వాళ్ల చేతుల్లో నుండి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్ అనేది ప్రభుత్వ భిక్ష కాదని, విద్యార్థుల హక్కు అని అన్నారు. రాష్ట్రంలోని వేలాది మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు స్కాలర్షిప్ లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. స్కాలర్షిప్ అందని కారణంగా విద్యార్థులు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (టిసిలు), మెమోలు తీసుకోలేక, వారి పై చదువులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని తెలియజేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చదువుతున్న విద్యార్థుల వద్ద కొన్ని కార్పొరేట్ కళాశాలలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పరిస్థితిని అరికట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను మెస్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అరుణ్, మనీష్, అభిరామ్, సాయి పాల్గొన్నారు.