Mahaa Daily Exclusive

  నేడు పాలిసెట్ రెండో విడత కౌన్సిలింగ్..!

Share

ఆదిలాబాద్, మహా

పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్ రెండవ విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 24న ఒకరోజు ఉంటుందని ఆదిలాబాద్ ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బండి రాంబాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కౌన్సెలింగ్ వివరాలను వెల్లడించారు. ఈనెల 24న ఉదయం నుండి సాయంత్రం వరకు సర్టిఫికెట్ వేరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. మొదటి పేజ్ లో సర్టిఫికెట్ వేరిఫికేషన్ కానివారు, వెబ్ ఆప్షన్ లు పెట్టుకొని వారు ఈ రెండవ విడత కౌన్సెలింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్ వేరిఫికేషన్ పూర్తయిన వారు 24, 25 తేదీల్లో ఆన్ లైన్ లో వెబ్ అప్షన్స్ పెట్టుకోవాలని తెలిపారు. 28న సీటు అలాట్ మెంట్ అవుతుందని, 28, 29 తేదీల్లో ఆన్ లైన్ లో ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. 28 నుండి 30తేదీ వరకు కళాశాలలో రిపోర్ట్ చేయాలని అన్నారు. అలాగే 31తేదీ సాయంత్రం లోపు కళాశాలలో కచ్చితంగా సీటు కన్ఫర్ చేసుకోవాలని సూచించారు. ఒక బ్రాంచ్ నుండి మరొక బ్రాంచ్ కు మారడానికి ఆగస్టు 2, 3వ తేదీల్లో స్లైడింగ్ ఆప్షన్ ఉంటుందని వివరించారు. వీరికి ఆగస్ట్ 5వ తేదీన సిట్ అలాట్ అవుతుందని, 6న సిటు కన్ఫర్మ్ చేసుకోవాలని సూచించారు. మొదటి, రెండవ విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత ఇంకా ఏ బ్రాంచ్ లో ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయో తెలిపేందుకు ఆగస్టు 6న లిస్ట్ ను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఈ మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేస్తామని వెల్లడించారు. ఆగస్టు 7న కళాశాలలో అప్లికేషన్ ఉంటుందని, ఆగస్టు 11 లోపు మిగిలిన సీట్లను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. స్పాట్ కు వచ్చే వారు సంవత్సరం ఫీజుతో పాటు సరైన ధ్రువపత్రాలతో కళాశాలలో హాజరు కావాలని సూచించారు.