Mahaa Daily Exclusive

  మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు..!

Share

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను కేంద్రం పొడిగించింది. సీఎం బీరెన్‌ సింగ్‌ రాజీనామా అనంతరం ఫిబ్రవరి 13న విధించిన పాలనను మరో 6 నెలలు పొడిగిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టగా, లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీంతో ఫిబ్రవరి 2026 వరకు రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. మణిపూర్‌లో శాంతి భద్రతలు దిగజారడం, తెగల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రపతి పాలనకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.