ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ మాజీ ఎమ్మల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అత్యంత కీలకమైన పాత్ర పోషించారని.. అక్రమ సంపాదనను ఆయన హవాలా రూపంలో విదేశాలకు తరలించారని చంద్రగిరి MLA పులివర్తి నాని ఆరోపించారు. దుబాయ్, సింగపూర్, శ్రీలంకకు భారీఎత్తున హవాలా రూపంలో నగదు తరలించినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని నాని తెలిపారు. సిట్ అధికారులు అడిగితే సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సోమవారం తిరుపతిలో ఆయన చెప్పారు.
Post Views: 67








