ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ పథకం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రద్దీ పెరిగితే స్కూల్ బస్సులు ఉపయోగిస్తామని వెల్లడించారు. పాఠశాలల వేళల్లో వాటిని ఉపయోగించమని స్పష్టం చేశారు. 2 రోజుల్లో డ్రైవర్లు, మెకానిక్ల నియామకాలు చేపడుతామని తెలిపారు. అలాగే త్వరలోనే కారుణ్య నియామకాలు భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
Post Views: 86








