కాటారం, మహా : భూపాలపల్లి జిల్లా కాటారం మార్కెట్ యార్డులో రైతుల పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తానని నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య అన్నారు సోమవారం కాటారం మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు శాలువాతో ఘనంగా చైర్మన్ ను సన్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ తిరుమల సమయం మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైతులు పండిస్తున్న ధాన్యం దూరప్రాంతాలకు వెళ్లి విక్రయించాల్సి వస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఇక్కడే ధాన్యం క్రయ,విక్రయాలు చేసుకునేలా సౌకర్యం కల్పనకు కృషి చేస్తానన్నారు. కాటారం సబ్ డివిజన్లో ఎక్కువగా మిర్చి పంటను రైతులు సాగు చేస్తారని అన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సహకారంతో పంట ఉత్పత్తులను నిల్వ చేసుకొని,గిట్టుబాటు ధర ఉన్నప్పుడు విక్రయించుకునేలా కాటారం మార్కెట్లో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. రైతులకు సరిపడా యూరియా లభించక ఇబ్బందులు పడుతున్నారని చైర్మన్ కు వ్యాపారస్తులు చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కాటారం మండలంలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కోటాను కేటాయించాలని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, నాబార్డు జిఎం శ్యామ్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మద్ది నవీన్ కుమార్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పవిత్రం శ్రీనివాస్, ఆవోప మండల శాఖ అధ్యక్షులు మద్ది లక్ష్మీనరసింహ మూర్తి,బచ్చు ప్రకాష్,కోశాధికారి దారం నందకిషోర్, అనంతుల శ్రీనివాస్, కముటాల రవీందర్, అల్లాడి చంద్రమౌళి, ముక్క శ్రీనివాస్,మద్ది శ్రీమన్నారాయణ, మద్ది సంపత్, బీరెల్లి తిరుమలేష్, దారం సంతోష్ లు పాల్గొన్నారు.








