కాటారం , మహా : మండలంలోని గొల్లపల్లి,అంకుషాపూర్,బయ్యారం అంగన్వాడీ కేంద్రాలలో సోమవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పుట్టిన బిడ్డకు ద్రవపదార్థాలు ఇచ్చినట్లయితే నీళ్ల విరోచనాలు న్యూమోనియా శ్వాసకోశ జబ్బుల తో పిల్లలు ఇబ్బంది,ఉబకాయానికి లోనవుతారని మహాదేవపూర్ సిడిపిఓ రాధిక రెడ్డి అన్నారు. తల్లిపాలు ఇవ్వకపోవడం వలన తల్లులకు రొమ్ము,అండాశయం క్యాన్సర్ బారిన పడుతారని అవగాహన కల్పించారు. గొల్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.
ఆరు నెలల తర్వాత బిడ్డకు
అన్నప్రాసన చేయాలని,బిడ్డకు అనుబంధ ఆహారంతో 2 ఏళ్ల వరకు తల్లిపాలు ఇవ్వాలని చెప్పారు.సెక్టార్ సూపర్వైజర్ లు వీణ, కే శివరాణి, ఎన్జీవో సమ్మయ్య,అంగన్వాడీ టీచర్స్ జి సువర్ణ,హైమావతి, షాహెద, శ్రీలత తల్లులు,గర్భిణీ,బాలింతలు పాల్గొన్నారు.
Post Views: 80








