మంచిర్యాల, మహా : కనీస వేతనాల పెంపుకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, ఎస్సీ కేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దూలం శ్రీనివాస్ lu ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ
సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ ధర్నా కార్యక్రమాలను నిర్వహించినట్లు వారు వెల్లడించారు. 2021లో విడుదల చేసిన 5 ప్రిలిమినరీ జీఓలను వెంటనే గెజిట్ చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గత పదేళ్ళలో 4 కనీస వేతనాల సలహా మండళ్ళను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిస్ జీవోలలో కనీస వేతనాల నిర్ణయం సవరణల గురించి ప్రభుత్వానికి పలుసార్లు సిఫారసులు కూడా చేసిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆ సిఫారసులను బుట్టదాఖలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు జారీ చేసిన జీవోలను గెజిట్ చేయకపోవడం వల్ల ప్రతి నెల 6 వేల కోట్ల రూపాయలు కార్మికులు నష్టపోతున్నారని వివరించారు. కనీస వేతనాల సలహా మండలి ప్రతిపాదనలు పక్కనపెట్టి కేబినెట్ సబ్ కమిటీ చేస్తున్న కాలయాపనకు స్వస్తి చెప్పాలని డిమాండ్. ఈ ఆందోళనలో సిఐటియు నాయకులు సంకె రవి, గోమాస ప్రకాష్, కాసిపేట రాజేశం సీఐటీయు నస్పూర్ మండల కన్వినర్, మహేందర్ ఎస్సి.కె.ఎస్ శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షులు, సమ్మయ్య సతీష్, శ్రీశైలం సద్దాం సంపత్ ప్రవీణ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.








