Mahaa Daily Exclusive

  ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఖానాపూర్ లోనే నిర్మించాలి కలెక్టర్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేసిన జేఏసీ నాయకులు. ..!

Share

ఖానాపూర్ మ‌హా : నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏర్పాటు చేయాలని, జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు , ఇదే విష‌య‌మై గత కొన్ని నెలల నుండి దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జేఏసీ కన్వీనర్ నందిరామయ్య అన్నారు. ఖానాపూర్ మండలం తిమ్మాపూర్ శివారులో గల 110 ఎకరాల భూమికి సంబంధించినటువంటి సర్వే ను అధికారుల‌ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు .ఆ సర్వే కి సంబంధించిన రిపోర్టును మంగ‌ళ వారం ఖానాపూర్ తాసిల్దారును అడగగా కలెక్టర్ కార్యాలయం నుండే తీసుకోవాలని ఎమ్మార్వో సూచించిన‌ట్టు తెలిపారు. ఈసంద‌ర్భంగా కలెక్టర్ ను కలిసి ఆ రిపోర్టు త‌మ‌కు ఇవ్వాలని కోరిన‌ట్టు వివ‌రించారు. ఇక్కడ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంటిగ్రేటెడ్ స్కూలు ఖానాపూర్ నుండి ఎటు కూడా తరలించవద్దని అది ఖానాపూర్ లోనే నిర్మించాలని జేఏసీ తరపున డిమాండ్ చేశారు..