భైంసా మహా : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రానికి చెందిన బొడ్డు యశోద పాము కాటుతో మృతి చెందడంతో మృతిరాలి భర్త బొడ్డు పోతన్నకు ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ 10 లక్షల రూపాయల ప్రమాద భీమా చెక్కును అందజేశారు. మహిళలు తప్పనిసరిగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం ఇస్తున్న ఇందిర మహిళా శక్తి ప్రమాద బీమా కష్ట కాలంలో అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం రాథోడ్ ఉత్తమ్, స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ స్వాతి, ఐకేపీ సి. సి. సరస్వతి, బిజెపి నాయకులు సత్యనారాయణ్ గౌడ్, యేశాల దత్తాత్రి, సంవ్లీ రమేష్, గులాబ్, నాగేందర్ తదితరులు ఉన్నారు.
Post Views: 16








