Mahaa Daily Exclusive

  గ్యాస్ సిలిండర్ పేలి అశ్వరావుపేటలో దగ్ధమైన ఇల్లు..!

Share

అశ్వరావుపేట మండలంలోని గాండ్లగూడెం (తండా) గ్రామంలో మంగళవారం రాత్రి గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ధారవత్‌ బాలజీ ఇంటి పూర్తిగా దగ్ధమైంది. సుమారు ₹3 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఫర్నిచర్‌, వ్యవసాయ సామాగ్రి, బట్టలు, ఆస్తి పత్రాలు పూర్తిగా కాలిపోయాయి. కట్టుబట్టలతో భార్య, పిల్లలు రోడ్డుపై ఉన్నారని, ప్రభుత్వం లేదా దాతలు సహాయం చేయాలని బాధితుడు వేడుకుంటున్నాడు.

Latest