AP: సీఎం చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో తాను అనుకున్నట్లు అరాచకం జరగలేదని జగన్ అసహనం చెందుతున్నాడంటూ ఆరోపించారు. జగన్ వైఖరి ఎలాంటిదో ప్రజలకు తెలిసిందేనని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని తెలిపారు. నామినేషన్ వేసేందుకే భయపడే పరిస్థితి నుంచి 11 మంది పోటీ చేశారంటూ వ్యాఖ్యానించారు.
Post Views: 69







