‘ఆడుదాం ఆంధ్రా’ స్కామ్ కేసులో విజిలెన్స్ విచారణ ఇప్పటికే పూర్తైంది. ఈ స్కామ్లో రూ.40 కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా, శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. విజిలెన్స్ నివేదిక ఆధారంగా వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
Post Views: 101






