Mahaa Daily Exclusive

  భద్రాద్రి వద్ద నిలకడగా గోదావరి తాలిపేరు 6 గేట్లు ఎత్తి 8,651 క్యూసెక్కుల నీరు విడుదల …!

Share

మహా భద్రాచలం

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా భద్రాద్రి వద్ద గోదావరి 33.7 అడుగులకు పెరిగి ప్రవహిస్తుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు 32.80 అడుగులు ఉన్న గోదావరి, మధ్యాహ్నం ఒంటి గంటకు 33.70 అడుగులకు పెరిగింది. ఒంటిగంట నుండి సాయంత్రం 6 గంటల వరకూ నిలకడగా ప్రవహించింది. కాగా భద్రాచలం నుండి 5,29,708 క్యూసెక్కుల వరదనీరు దిగువకు తరలి వెళ్ళింది. కాగా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ కు భారీ గా వరదనీరు వచ్చి చేరడంతో 6 గేట్లు తెరిచి 8,651 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న గోదావరి లోకి వదిలారు

Latest