నేలకొండపల్లి, ఆగస్టు 17 మహా:
మండలం లోని నాచేపల్లి-మంగాపురం గ్రామాల మధ్య రహదారి లో ఆదివారం ట్రాఫిక్ భారీగా నిలిచింది. నాచేపల్లి వద్ద రహదారి వరద కు కొట్టుకపోవటంతో వాహానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. దీంతో వాహానాలు రాకపోకలకు ఇబ్బందికరంగా ఉండటంతో రహదారి కి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. రహదారి వరద తాకిడికి కొట్టుకపోయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవటంతో రహాదారి అధ్వానంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Post Views: 74






