అశ్వాపురం. మహా.ఆగస్టు 20 న హైద్రాబాద్ లో…
గద్దల నాగేశ్వరరావు మాదిగ జేఏసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్.
ఆగస్టు ఇరవై వ తేదీన రాజధాని నడిబొడ్డున బషీర్భాగ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయుకుడు, మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డా. పిడమర్తి రవి నాయకత్వంలో పానీ – పూరీ గో బ్యాక్ అనే నినాదంతో రాష్ట్రం లో మరో తెలంగాణ ఆస్తిత్వ ఉద్యమ ఆవిర్భావ సభ జరుగుతుందని తెలిపారు. బతుకు దెరువుకోసం తెలంగాణ కు వచ్చి ఆర్ధిక పరిపుష్టి సాధించి, బరితెగించి దాడులకు దిగుతున్న ఉత్తరాది మార్వాడీల పెత్తనాన్ని ప్రశ్నిస్తూ, జరుగుతున్న ఈ సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న తెలంగాణ వర్తక సంఘం మరియు స్థానిక వ్యాపారులు, ప్రజా సంఘాల నాయుకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ వాది గద్దల నాగేశ్వరరావు తెలిపారు.






