సత్తుపల్లి.మహా.
మహిళలు, యువతులు ఏ ఇన్వేషన్స్ వారు అందిస్తున్న ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ ను నెలసరి సమయంలో వాడటం మేలని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. సత్తుపల్లిలోని చెర్రీస్ రెస్టారెంట్లో ఏ ఇన్నోవేషన్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సోమవారం ప్రారంభించారు. అదేవిధంగా ఆ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చిన వెల్లో విష్ బయో డిగ్రేడబుల్, ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్ ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జగం అశ్వినితో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న శానిటరీ ప్యాడ్స్ కు బదులు ఏ ఇన్వేషన్స్ అందిస్తున్న ఆర్గానిక్ ఫ్యాట్స్ ను వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండా, సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎం రాజేశ్వరరావు, సిడిపిఓ మెహరున్నీసాబేగం, తోట సుజలా రాణి, పలు స్వచ్ఛంద సంస్థల బాధ్యులు కొనకళ్ల సుధారాణి, గాదె నరసింహారెడ్డి, వలపర్ల రవి, ఇనపనూరి రాధాకృష్ణ, కామెర్ల క్రాంతి, జొన్నలగడ్డ రాజు, జంగా సత్యనారాయణ, గట్టె వాసు, కాంగ్రెస్ నాయకులు గాదె చెన్నారావు, దొడ్డ శ్రీనివాసరావు, కమల్ పషా పాల్గొన్నారు.






