నేలకొండపల్లి, ఆగస్టు 18 మహా:
నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని ఆమ్ ఆద్మీ పార్టీ ఖమ్మం.
జిల్లా ఉపాధ్యాక్షుడు పసుమర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ సాధన కోసం చేపట్టిన చలో రాజభవన్ ముట్టడి కార్యక్రమం కు వెళ్లకుండా పోలీసులు సోమవారం ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు..చలో రాజభవన్ కార్యక్రమం ను విఛ్చినం చేసేందుకు పోలీసులతో అరెస్ట్లు చేయించారని అన్నారు. బీసీ బిల్లు పై బీజెపీ, కాంగ్రెస్ పార్టీలకు చిత్తశుద్ది లేదని అన్నారు. బీసీ రిజర్వేషన్ పై అన్ని పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. ముందస్తు అరెస్ట్ చేసిన ఆఫ్ నాయకులను వెంటనే బేషరత్ గా విడుదల చేయాలని కోరారు. ఆరేస్ట్ లు ఆప్రజాస్వామికం అన్నారు. ప్రభుత్వం తీరు మారకపోతే మరింత స్థాయిలో ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
Post Views: 104






