నేలకొండపల్లి, ఆగస్టు 18 మహా:
నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన పోరాట మార్గం ను కొనసాగించాలని బీజెపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ పిలుపునిచ్చారు. మండలం లోని చెరువుమాధారంలో చంద్రబోస్ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఆయన విగ్రహాం కు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు…దేశ స్వాతంత్ర కోసం భోస్ చేసిన పోరాట స్పూర్తి నేటి తరంకు ఆదర్శమని పేర్కోన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు, రామకృష్ణ. కొండా హర్షవర్ధన్. దేశబోయిన వేణుబాబు, మూడు రమేష్. సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 85






