AP: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు వైసీపీ మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వైసీపీ అధినేత జగన్‌కు కాల్ చేసి మాట్లాడారు. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని కోరారు. దానికి జగన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభలో ఏడుగురు, లోక్‌సభలో నలుగురు సభ్యులు ఉన్నారు.
Post Views: 71






