AP: గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత, జౌళి శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ అధికారులు అర్హులైన నేతన్నలకు సకాలంలో ముద్ర రుణాలు అందజేయాలని ఆదేశించారు. చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్తు ప్రయోజనాలు అందేలా గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని’ సూచించారు. ఆప్కో ద్వారా అమ్మకాలు పెంచి, కొత్త డిజైన్లతో తయారు చేసిన చేనేత దుస్తులను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రాచుర్యం చేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.
Post Views: 54






