AP: నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో 2,778 డిప్యుటేషన్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదనంగా 1,785 సచివాలయాల్లో 993 కొత్త పోస్టులను మంజూరు చేసింది. చింతూరు CHCని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. అలాగే నాలా పన్నులో 70% స్థానిక సంస్థలకు, 30% అథారిటీలకు కేటాయించాలని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
Post Views: 31






