Mahaa Daily Exclusive

  ‘ఓట్ల చోరీ’తో ఫలితాలు తారుమారు: రాహుల్ గాంధీ

Share

గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బీజేపీ తారుమారు చేసిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’లో భాగంగా బిహార్‌లోని ముంగేర్‌లో గురువారం నిర్వహించిన సభలో రాహుల్ మాట్లాడారు. ‘ఓట్ల చోరీ’ని రాజ్యాంగంపై దాడిగా రాహుల్ అభివర్ణించారు. ఎన్నికల సంఘంతో బీజేపీ కుమ్మక్కై ఓట్ల అవకతవకలకు పాల్పడటాన్ని అనుమతించబోమని ఆయన తెలిపారు. ‘ప్రధాని మోదీ ఓట్ దొంగ’ అని రాహుల్ విమర్శించారు.

Latest