AP: రాష్ట్రంలో కూటమి నేతల దౌర్జన్యాలు బాగా పెరిగిపోయాయని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ‘మంత్రులు, ఎమ్మెల్యేలపైనా అవినీతి ఆరోపణలు ఎక్కువ అయ్యాయి. కూటమి నేతలు దోచుకోవడంలో బిజీగా ఉన్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని అంటారు. కానీ చర్యలు ఎందుకు తీసుకోరు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది’ అని మండిపడ్డారు.
Post Views: 10






