Mahaa Daily Exclusive

  ఆంధ్ర రాష్ట్ర సాధనలో ప్రకాశం పంతులుది కీలక పాత్ర: మంత్రి డోలా

Share

AP: ఆంధ్ర రాష్ట్ర సాధనలో టంగుటూరి ప్రకాశం పంతులు కీలక పాత్ర పోషించారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నివాళులర్పించారు. తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రకాశం పంతులు ప్రతీక అని కొనియాడారు. తుపాకీకి ఎదురు వెళ్లి పోరాడిన ఆంధ్రకేసరి జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం అని అన్నారు. తన సంపాదనంతా ప్రజా సంక్షేమానికే ఖర్చు చేశారని గుర్తు చేశారు.

Latest