TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 29న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుండగా.. స్థానిక సంస్థల వివరాలను మరోసారి సరిచూసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల పేర్లు, వాటి సంఖ్యను మరోసారి చెక్ చేసి వాటి వివరాలను వెంటనే రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు.
Post Views: 16








