AP: భార్యపై కోపంతో ఆగ్రహించిన భర్త.. కన్న కూతురును బుడమేరులోకి విసిరేశాడు. విజయవాడలోని చిట్టినగర్‌కు చెందిన కానూరు వెంకటస్వామి, పోలమ్మ దంపతులకు ఆరుగురు పిల్లలు. మూడు నెలల పాపతో పుట్టింటిలో ఉంటున్న పోలమ్మ వద్దకు భర్త వచ్చాడు. అక్కడ భార్యతో గొడవ జరగడంతో కూతురిని తీసుకొని వెళ్లి బుడమేరు వంతెన పైనుంచి బుడమేరులోకి విసిరేసి, పారిపోయాడు. స్థానికుడు నాగరాజు చిన్నారి ఏడుపులు విని చేరదీశారు. పోలీసుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు.
Post Views: 26






