వరంగల్ మహా;
వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ ఎస్సై శ్రీకాంత్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఫాస్ట్ ఫుడ్ నిర్వహిస్తున్న దళిత మహిళ పై చెయ్యి చేసుకొని కులం పేరుతో దూషించాడనే ఘటనలో బాధితురాలు మరియమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుల్ రాజు పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఎస్సై కూడా విధి నిర్వహణలో ఉన్న తన పై దళిత మహిళ మరియమ్మ అమర్యాదగా ప్రవర్తించి దుర్భాషలాడినందీకు గాను ఎస్సై శ్రీకాంత్ ఫిర్యాదుతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకురాలు మరియమ్మ, ఆమె కుమారుడు శేఖర్ పై సైతం కేసులు నమోదైనట్లు మిల్స్ కాలనీ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా బాధితురాలి ఫిర్యాదుతో ఎస్సై పై నమోదు అయిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును వరంగల్ పోలీస్ ఉన్నతాధికారి ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Post Views: 66







