Mahaa Daily Exclusive

  రెసిడెన్షియల్ పాఠశాలలో నీటి కలుషితంపై ఉద్యోగుల సస్పెన్షన్..!

Share

భూపాలపల్లి, మహా :
భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో మంచినీరులో పురుగుల మందు కలపడం, మొగుళ్లపల్లి కెజిబివి పాఠశాలలో ఆహారం కలుషిత ఘటనలకు కారకులైన సిబ్బందిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విధుల నుండి టెర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత పట్ల నిర్లక్ష్యం చూపిన సంబంధిత సిబ్బందిపై తక్షణ చర్యలు చేపట్టారు.
భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు, ఒక వంట మనిషిని బాధ్యతారాహిత్యం కారణంగా తొలగించారు. మొగుళ్లపల్లి కెజిబివి పాఠశాలలో ఆహారం కలుషిత సంఘటనపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఉద్యోగులను సస్పెన్షన్ వేటు వేశారు.
రెండు రోజుల క్రితం ఆహారం కలుషితమైందన్న అంశంపై తాజాగా ఎస్వో శైలజను, పిఈటీ శ్రావణి లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇదే పాఠశాలలో ఇప్పటికే నలుగురు వంట మనుషులను తొలగించారు. సీఎర్టీ ఫిజిక్స్ ఎ. ప్రియాంకను తాత్కాలిక ఇన్‌చార్జ్‌ ఎస్ఓ గా నియమించారు.విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయమై ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా సంబంధిత అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థుల ఆహారం, తాగునీరు నాణ్యతలో నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకున్నారు.
ఆగస్టు 21 మరియు 22 తేదీల్లో భూపాలపల్లి జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఆహారం కారణంగా ఫుడ్‌ పాయిజన్‌కు గురై ఆసుపత్రిలో చేరడం, అలాగే ఆహారంలో పురుగులు, కలవడం వంటి ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో సంబంధిత బాధ్యుల నిర్లక్ష్యం బయటపడిందని ఆయన తెలిపారు.
మొగుల్లపల్లి కేజీబీవీ లో…
కొరికిశాల పాఠశాలలో విధుల్లో నిర్లక్ష్యం, అధికారుల సూచనలను పట్టించుకోకపోవడం కారణంగా శ్రీమతి యు. శ్రావణి, పిఈటీను విధుల నుండి తొలగించారు
అదే పాఠశాలలో పర్యవేక్షణలో విఫలమైనందుకు ప్రత్యేక అధికారి శ్రీమతి బి. శైలజను కూడా విధుల నుండి తొలగించారు. ఆమె స్థానంలో
సీఎర్టీ ఫిజిక్స్ శ్రీమతి ఎ. ప్రియాంకను తాత్కాలిక ఇన్‌చార్జ్‌ ఎస్ఓ గా నియమించారు.
జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్ర బోస్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు పురుగుల. మందు కలిపిన కలుషిత నీరు ఇచ్చిన ఘటనతో పాటు విద్యార్థులను భయపెట్టడం, శారీరక దాడి చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలతో
హెచ్. సూర్యకిరణ్, సీఆర్టీ,
బి. వేణు సీఆర్టీ,
పి. రాజేందర్, సీఆర్టీ మరియు సిహెచ్. రాజేశ్వరి అసిస్టెంట్ కుక్
విధుల నుండి తొలగింపు చర్యలు తీసుకున్నట్లు
జిల్లా కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా వ్యవహరించిన వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం ఉండదని, భవిష్యత్తులో కూడా ఎవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Latest