కూసుమంచి, మహా:
ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం లోక్యతండా పంచాయతీ శివారు కొత్తతండాలో ఆదివారం విషాదం నెలకొంది. కొత్త తండాకు చెందిన వడ్తియా రాంబాబు తన ఆరేళ్ళ కుమారుడు భువనేశ్వర్ తో కలిసి తన పోలంలో ట్రాక్టర్ రోటావేటర్ తో దుక్కి దున్నుతూ ఉన్నాడు. ప్రమాదవశాత్తు భువనేశ్వర్ రోటావేటర్ లో పడి మృతి చెందాడు. కండ్ల ముందే కన్నకొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు బోరుమని రోదిస్తున్నారు. రాంబాబు, దీపిక దంపతులకు ఆరేళ్ళ క్రితం కవలపిల్లలు జన్మించారు. సుమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
Post Views: 64







