Mahaa Daily Exclusive

  సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష ఉద్యమాలకు తీరని లోటు..!

Share

జూలూరుపాడు, ఆగస్టు 24, (మహా): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష పార్టీలకు తీరని లోటు అని సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్.కె షబీర్ పాషా అన్నారు. వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ ముక్దూం భవన్లో వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశ రాజకీయాలు ప్రజల పక్షాన నిలబడి అనేక పోరాటాలు చేశారని, పేదల కోసం వారి హక్కుల కోసం కృషి చేశారని తెలిపారు. వారికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు. వారి ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కోరారు. వారి వెంట ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయకార్యదర్శి ఎస్.కె చాంద్ పాషా, అనుమల సాయి, భూక్య శ్రీనివాస్ వేల్పుల మల్లికార్జున్, అజిత్ తదితరులు ఉన్నారు.

Latest