చింతకాని ,ఆగస్టు 24(మహ
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహకులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చింతకాని ఎస్.ఐ నాగుల్ మీరా తెలిపారు. ఆదివారం నిర్వహకులకు, డి.జె యజమానులకు గ్రామ పెద్దలకు స్థానిక పోలీస్ స్టేషన్ లో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. మండపం నిర్వహకులు ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేసి,విద్యుత్ శాఖ అనుమతి పత్రం, మైక్ పర్మిషన్ అనుమతి పత్రంతో జత చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని,డి.జె లకు ఎటువంటి అనుమతి లేదని ఆయన పునరుద్ఘాటించారు. .మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా, ఇతరులకు ఇబ్బందులు పెట్టకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని తెలియజేశారు.
Post Views: 31







