Mahaa Daily Exclusive

  ఆలయ స్ధల దాతకు సన్మానం..!

Share

కారేపల్లి, మహా : కారేపల్లి మండలం ఎర్రబోడులో ఆదివాసీలకు ప్రత్యేకంగా ఉన్న స్వయంబు ముత్యాలమ్మ తల్లి విగ్రహం ఉంది. అక్కడే ఆదివాసీలు పూజలు చేస్తుంటారు. ఆ ఆలయానికి కీర్తిశేషులు నర్సింగ్‌ సత్యనారాయణ`సరోజిని, నర్సింగ్‌ ప్రసాద్‌ జ్ఞాపకార్ధం వారి కుటుంబ సభ్యులు రెండు కుంటల స్ధలాన్ని విరాళం ఇచ్చారు. ఈసందర్బంగా ఎర్రబోడు మాజీ సర్పంచ్‌ కుర్సం సత్యనారాయణ ఆధ్వర్యంలో స్ధల దాతలు నర్సింగ్‌ సాయిగణేష్‌, కవిత, పూజితల ను ఆదివాసీ పెద్దలు సన్మానించారు. ఈకార్యక్రమంలో పూనెం బాబు దొర, పెండెకట్ల నాగేశ్వరరావు, పూనెం భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest