Mahaa Daily Exclusive

  యూరియా కోసం రైతుల అవస్థలు పట్టటం లేదా… నేడు మండల కేంద్రాలలో సంఘం ఆధ్వర్యంలో ధర్న..!

Share

నేలకొండపల్లి, ఆగస్టు 24 మహా:

యూరియా కోసం రైతులు అవస్థలు ప్రభుత్వం కు పట్టటం లేదని రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి పాల్తీయా శ్రీనివాసరావు ఆరోపించారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు… యూరియా అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వాల మధ్య వైరం రైతుల పై కక్ష తీర్చుకుంటున్నారని అన్నారు. అన్నదాతలు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారని అన్నారు. కానీ రైతులకు సరిపడా అందించలేని దుస్ధితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వాలు సరఫరా, చేయలేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని అన్నారు. రైతులకు వెంటనే సరిపడా యూరియా ను అందించకపోతే ప్రత్యక్ష ఆందోళన చేస్తానని హెచ్చరించారు. యూరియా ఇబ్బందులు తొలిగించాలని కోరుతూ సోమవారం మండల కేంద్రాలలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావునా రైతులు ఈ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకర్ల సమావేశంలో రైతు సంఘం సభ్యులు మల్లేబోయిన ఉపేందర్, కాశిబోయిన అయోధ్య తదితరులు పాల్గొన్నారు.

Latest