Mahaa Daily Exclusive

  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంపై మంత్రుల కమిటీ కసరత్తు ..!

Share

ఖమ్మం, మహా:

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడంపై మంత్రుల కమిటీ ఆదివారం సాయంత్రం ప్ర‌జాభ‌వ‌న్ లో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై కసరత్తు చేసింది . రాష్ట్రంలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల గ‌ణ‌న‌ చేపట్టాము. ఈ విష‌యంపై ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు వాగ్దానం కూడా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు ఓబీసీ కులగణ‌న‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా చేపట్టిన‌ట్లు మంత్రుల క‌మిటీ తెలిపింది. సోషియో, ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వేలో వచ్చిన ఎంపీరికల్ డాటాను శాసనసభలో ప్రవేశపెట్టి, స్థానిక సంస్థల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును శాసనసభలో పెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేసి గవర్నర్ కు పంపాం.

ఆ బిల్లు గవర్నర్ నుంచి రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది. ప్రస్తుతం రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద 5 నెల‌లుగా పెండింగ్ లో ఉంది. మరోవైపు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో బీసీల‌కు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఎలాంటి న్యాయపరమైన వివాదాలు ఏర్పడకుండా సలహా ఇవ్వాల్సిందిగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయం కోరారు. ఇదే అంశంపై సోమవారం జస్టిస్ సుదర్శన్ రెడ్డి మరియు ఢిల్లీలో ప్రముఖ న్యాయ కోవిదుల అభిప్రాయం సైతం తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. సమావేశంలో మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు పాల్గొన్నారు. కమిటీ సభ్యుడైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ లో అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Latest