ఖమ్మం, మహా:
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో వెంగళరావు నగర్ పరిధిలోని 14 బూత్ లకు సంబంధించిన బుత్ కమిటీ సభ్యులతో సమావేశం ఆదివారం రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, విత్తనాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి జెండా ఎగురవేయాలన్నారు,నేతలంతా ఐక్యంగా పనిచేయాలని కోరారు.. అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పని చేయాలని దిశా నిర్దేశం చేశారు..
దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ రాయల నాగేశ్వరరావు..
హైదరాబాద్ కూకట్ పల్లి లోని కోలన్ రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ నందు కంభంపాటి సత్యనారాయణ సతీమణి కంభంపాటి జయలక్ష్మి దశ దిన కర్మ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గోని,వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..







