నక్సలిజంపై ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిని కేంద్ర మంత్రి అమిత్ షా టార్గెట్‌గా చేసుకోవడాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఖండించారు. చెన్నైలో ఆదివారం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. కేంద్రం ఈ సమస్యను పరిష్కరించలేకపోయిందని, తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఆయన్ను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఉప రాష్ట్రపతి పదవికి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి పూర్తి అర్హత కలిగిన వ్యక్తి అని స్టాలిన్ వెల్లడించారు.
Post Views: 40






